పతిఘటన  నేటిభారతం తరహాలో…

తారానీలు కార్పొరేషన్ పతాకంపై అనురాగ్(ఎమ్.ఎస్.బాబు) స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.. అనిల్ నెమలి హీరోగా పరిచయమవుతున్నారు. మేఘన కథానాయిక. నాయకానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీరామ్ క్లాప్‌నివ్వగా, భూపతి రాజా కెమెరా స్విఛాన్ చేశారు. దాసరి కిరణ్‌కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. ప్రారంభోత్సవ వేడుకకు లకా్ష్మరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత ఎమ్.ఎస్ బాబు మాట్లాడుతూ ప్రతిఘటన, నేటిభారతం తరహాలో విప్లవభావాలతో సాగే చిత్రమిది. నలుగురు కుర్రాళ్లు సమాజంలో ఏ విధంగా మార్పు తీసుకొచ్చారనేది ఆసక్తిని పంచుతుంది. మతకల్లోలాలు జరగకుండా సంఘవిద్రోహుల పన్నాగాన్ని ఎలా అడ్డుకున్నారనేది చిత్ర ఇతివృత్తం. కథ కోసం చరిత్రను అన్వేషించాను. చాలా పరిశోధన చేసి సినిమా రూపంలో ఆవిష్కరిస్తున్నాం. పూర్వకాలంలో మన దేశాన్ని అయిదువందల మంది రాజులు పరిపాలించారు. ఆ రోజుల్లో ప్రజలపై అప్పుల భారం ఉండేదికాదు. ఆధునిక పాలనలో తలా ఒక్కరిపై 26 వేల అప్పు ఉంది. రాజులంతా రైతుల శ్రేయస్సు కోసం కాంక్షిస్తే నేటి పాలనలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా పలు అంశాలను ఈ సినిమాలో ఆవిష్కరిస్తున్నాం. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. రెండు షెడ్యూళ్లలో చిత్రీకరణ పూర్తిచేస్తాం. హీరో అనిల్ నెమలి రామానాయుడు ఫిలింస్కూల్‌లో శిక్షణ పొందాడు. ప్రధాన పాత్రకు అతడు న్యాయం చేస్తాడనే నమ్మకముంది అని తెలిపారు. కామెడీ, లవ్, పాలిటిక్స్, సెంటిమెంట్ వాణిజ్య హంగులన్నీ ఉన్న చిత్రమిదని మేఘన తెలిపింది.నెమలి అనిల్ మాట్లాడుతూ స్వతహాగా దర్శకత్వ మంటే నాకు మక్కువ. ఫిలిం టెక్నాలజీలో ఏడాది కోర్సు పూర్తిచేశాను. బాబు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాను. మాస్ కోణంలో నా పాత్ర పాత్ర సాగుతుంది అని చెప్పారు. ఎమ్.ఎస్. బాబుతో తనకు 15 ఏళ్లుగా పరిచయముందని, మంచి కథతో ఆయన చేస్తున్న చిత్రమిదని నెమలి సురేష్ చెప్పారు.

Please follow and like us: