సవ్యసాచి రివ్యూ

దర్శకత్వం : చందు మొండేటి
నిర్మాతలు : నవీన్ వై. సి వి మోహన్, వై రవి శంకర్
సంగీతం : ఎమ్ ఎమ్ కీరవాణి
సినిమాటోగ్రఫర్ : జే యువరాజ్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
నటీనటులు : నాగచైతన్య, నిధి అగర్వాల్, మాధవన్, భూమిక, వెన్నల కిషోర్ తదితరులు.
విడుదల తేదీ : నవంబర్ 02, 2018
రేటింగ్ :2. 75 / 5

స్టార్ ఇమేజ్ కోసం కాకుండా భిన్నమైన కథనాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు నాగ చైతన్య. కార్తికేయ సినిమాతో ప్రత్యేకతను చాటుకున్న యువ దర్శకుడు చందూ మొండేటి.. ఆ తర్వాత చైతు తో ‘ప్రేమమ్’ రీమేక్ తోనూ మెప్పించాడు. టైటిల్ తో పాటు విభిన్నమైన కథతో తెరకెక్కిన సవ్యసాచి పై మొదటినుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. నిధి అగర్వాల్ హీరోయిన్ గా ప్రముఖ తమిళ నటుడు మాధవన్, మాజీ హీరోయిన్ భూమిక కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ సవ్యసాచి కథేమిటో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..

కథ:

విక్రమ్ (నాగచైతన్య) ఒక చిత్రమైన లక్షణంతో పుట్టాడు. కవలలుగా పుట్టాల్సిన వాళ్ళు పోషకాహార లోపం వాళ్ళ .. ఒక బోడీలోకి వచ్చేస్తారు .. అది అతని నర్వ్ సిస్టం తో పాటు ఎడమ చేతిలోకి కలిసిపోతుంది.దాంతో అతడి ఎడమ చేయి తన మాట వినదు. ఆ చేతికి స్పర్శ వేరు. దాని ఆలోచనలు వేరు. ఈ చేతి వల్ల విక్రమ్ తరచుగా ఇబ్బందులు పడుతుంటాడు. దాన్ని అసహ్యించుకుంటూ ఉంటాడు. ఇలాగే పెరిగి పెద్దయిన విక్రమ్.. కాలేజీలో తన జూనియర్ అయిన చిత్రను ప్రేమిస్తాడు. అనుకోని కారణాలతో ఆమెకు దూరమైన విక్రమ్.. ఆరేళ్ల తర్వాత తిరిగి ఆమెను కలుస్తాడు. మళ్లీ ఆమెకు చేరువ అవుతాడు. ఇలా సాఫీగా సాగిపోతున్న సమయంలో అతడి జీవితంలో పెద్ద అలజడి మొదలవుతుంది. ఒక ప్రమాదంలో అతడి అక్క ( భూమిక ) ఇంట్లో సిలండర్ పేలడంతో అతడి బావ చనిపోయి.. అక్క ఆసుపత్రి పాలవుతుంది. విక్రమ్ ప్రాణంలా చూసుకునే అతడి మేనకోడలు కనిపించకుండా పోతుంది. దీని వెనుక ఒక అజ్ఞాతవ్యక్తి ఉన్నాడని తెలుసుకుంటాడు విక్రం. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు. విక్రమ్ కు అతనికి ఉన్న సంబంధం ఏమిటి ? అతడి ఇంటిలిజెన్స్ గేమ్ ని విక్కీ ఎలా అడ్డుకున్నాడు ? ఈ విషయంలో అతడి ఎడమ చేయి ఎలా సహకరించింది.. అన్నది మిగతా కథ.

నటీనటుల ప్రతిభ :

ఈ సినిమాలో నాగ చైతన్య ఒకరిలో ఇద్దరిలా అనిపించేలా చక్కని నటనను కనబరిచాడు. గత సినిమాల్లో కంటే కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. తన నటనతో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. నాగచైతన్య తన కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ పాత్ర అని చెప్పొచ్చు. ప్రథమార్ధం వరకు అతడి పాత్ర మామూలుగా అనిపించినా.. ద్వితీయార్ధంలో ప్రత్యేకత చాటుకుంటుంది. మాధవన్ తన ప్రత్యేకత చూపించాడు. కెరీర్లో తొలిసారి పూర్తి స్థాయి నెగెటివ్ రోల్ చేసిన మాధవన్.. తన పాత్రకు వెయిట్ తీసుకొచ్చాడు. అలవోకగా ఈ క్యారెక్టర్ చేసుకుపోయాడు. ఐతే మాధవన్ స్థాయికి తగ్గ పాత్ర అని మాత్రం అనిపించదు. హీరోయిన్ నిధి అగర్వాల్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఆమె అందంగా ఉన్నప్పటికీ.. నటించే ఆస్కారమే లేదు. తన పాత్రలోనూ ఏ ప్రత్యేకతా లేదు. భూమికది కూడా మామూలు క్యారెక్టరే. వెన్నెల కిషోర్.. సత్య.. సప్తగిరి అక్కడక్కడా నవ్వించారు.

టెక్నీకల్ హైలెట్స్ :

ఇక టెక్నీకల్ విషయాలను పరిశీలిస్తే .. కీరవాణి అందించిన సంగీతం బాగుంది. థీమ్ సాంగ్ బాగున్నా .. పాటలు మాత్రం పెద్దగా ఆకట్టుకోవు. ముక్యంగా నిన్ను రోడ్డుమీద చూసినది లగాయతు .. పాట ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. పైగా ఈ పాటను నిరాశ పరచారు. థమార్ధం వరకు నేపథ్య సంగీతం మామూలుగా అనిపించినా.. ద్వితీయార్ధంలో ప్రత్యేకత చాటుకుంటుంది. యువరాజ్ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సినిమా అంతా రిచ్ గా కనిపిస్తుంది. ఇక దర్శకుడు చందూ మొండేటి ఎంచుకున్న కథ బాగుంది. కొత్తగా అనిపిస్తుంది కూడా. ఐతే హీరో ఎడమచేయి అతడి మాట వినకపోవడం అనే యునీక్ పాయింట్ ను తీసుకుని దాన్ని టెక్నీకల్అంశాలతో మరింత బాగా చేసి ఉండొచ్చు .. కానీ ఆ పాయింటును సరిగ్గా వాడుకోలేకపోయాడు చందూ. ప్రధాన పాత్రల్ని బాగానే తీర్చిదిద్దుకున్నాడు. కానీ ఈ కొత్త కథకు తగ్గ ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే విషయంలో కన్ఫ్యూజ్ అయ్యాడు.

చివరిగా :

ఇప్పటి వరకు మనం షార్ట్ టుర్మ్ మెమొరీ లాస్, మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ లాంటి కథలను చూసాం .. ఇదికూడా అలాంటిదే .. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అన్న లోపం అని చెప్పాలి .. హీరో ఎడమ చేయి అతడి మాట వినదు. అది వేరే మనిషి. దాని ఆలోచన వేరు. దాని ప్రవర్తన వేరు. వినడానికి చాలా ఎగ్జైటింగ్ గా అనిపించే కాన్సెప్ట్ ఇది. ఆరంభంలో ఈ కాన్సెప్ట్ ను పరిచయం చేస్తూ కన్విన్స్ చేసిన తీరు బాగుంది కానీ .. ఆరంభంలో ఉన్న క్యూరియాసిటీకి.. ఆ తర్వాత నడిచే వ్యవహారానికి సంబంధం ఉండదు. కొత్తగా అనుకున్న పాయింట్ ను సినిమాలో ఎలాంటి ఆసక్తి లేకుండా కథనం సాగడంతో అసలు విషయం ప్రేక్షకుకు మరచిపోతారు. సగటు లవ్ స్టోరీ.. కామెడీ ట్రాక్, సాగదీసిన అంశాలు .. కథను డైవర్ట్ చేస్తాయి. ప్రేక్షకుల్ని చివరిదాకా సస్పెన్సులో ఉంచి.. కొంచెం లేటుగా అసలు విషయాలన్నీ రివీల్ చేసి థ్రిల్ చేద్దామనే ఆలోచన సరైన ఫలితాన్నివ్వలేదు. హీరో-విలన్ మధ్య మైండ్ గేమ్ హీరోను ముప్పుతిప్పలు పెడుతుంటాడు విలన్. అతడికి పెద్ద ఛాలెంజ్ విసురుతాడు. థ్రిల్లర్ సినిమాల్లో మూడ్.. ఉత్కంఠను క్యారీ చేయడం కీలకం. కానీ ఇక్కడ మాత్రం దర్శకుడు ఈ మూడ్ మరో వైపు డైవర్ట్ చేసాడు. ఒకట్రెండు సీన్లలో ఎడమచేయి ప్రస్తావన ఉంటుంది కానీ.. మిగతా అంతా ఒక మామూలు సినిమా చూస్తున్న భావనే కలిగిస్తుంది. నిస్సారమైన కొన్ని ఎపిసోడ్లు సినిమాను పక్కదారి పట్టించాయి.

Please follow and like us: