రోషగాడి విజయం

విజయ్‌ ఆంటోని, నివేదా పేతురాజ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘రోషగాడు’. విజయ్‌ ఆంటోని ఫిలిం కార్పొరేషన్‌ ఫాతిమా విజయ్‌ ఆంటోని సమర్పణలో శ్రీ శ్రీ లక్ష్మీ హేరంబ ప్రొడక్షన్స్‌ పతాకం సినిమా నవంబర్‌ 16న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగాహైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన థాంక్స్ మీట్ కార్య‌క్ర‌మంలో… చిత్ర నిర్మాత జశ్వంత్ మాట్లాడుతూ – “ఈ సినిమా తెలుగులో విడుదల చేయడానికి రెండున్నర నెలల ప్రయత్నించి ఈ సినిమా హక్కులు సాధించాను. డైరెక్ట‌ర్ గణేశా గారు సినిమాను చాలా బాగా తెరకెక్కించారు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్“ అన్నారు. సినిమా డిస్ట్రిబ్యూటర్ శంకర్ మాట్లాడుతూ – “ఈ సినిమాను 300 సెంటర్ లలో రిలీజ్ చేయడం జరిగింది. ప్రతిచోటా మంచి టాక్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్షింపబడుతుంది“ అన్నారు. చిత్ర దర్శకులు గణేశా మాట్లాడుతూ – “తెలుగు లో చేద్దాం అని రెడి చేసిన సినిమా.కథ విజయ్ గారికి నచ్చడంతో ఒప్పుకున్నారు. చిరంజీవి నటించిన రోష‌గాడు` సినిమా లాంటి రెస్పాన్స్ వస్తుంది .ఆ సినిమా ఫీల్ ఉండడం తో `రోష‌గాడు` టైటిల్ ను ఒకే చేయడం జరిగింది. ఆడియన్స్ ఇది యాక్షన్ సినిమా అనుకుంటున్నారు. కానీ ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇందులో మంచి పాయింట్ కూడా ఉంటుంది. ప్రస్తుతం టీనేజ్ పిల్లలు ఎలా చెడు వైపు ఆలోచిస్తారు.వారిని పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి అనే ప్రతీ పాయింట్ ఇందులో ఉంటుంది. అందుకే ప్రతి ప్రేరెంట్ ఈ సినిమాను చూడాలి. సమాజం లో ప్రతీ వ్యక్తికి రోల్ మోడల్ ఎప్పుడూ హీరోనే అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా ఈ జెనరేషన్ కోసమే కాకుండా నెక్స్ట్ జెనరేషన్ కోసం కూడా ఉపయోగపడుతుంది“ అన్నారు. విజయ్ ఆంటోని మాట్లాడుతూ – “ఎప్పటి లాగే చాలా సంతోషంగా ఉంది. సినిమాను ఇంత అద్భుతంగా తెరకెక్కించిన గణేశా గారికి థాంక్స్. జశ్వంత్ గారు ఈ సినిమాకు చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌కి అల్ ద బెస్ట్.రామకృష్ణ, బాలకృష్ణ గారికి థాంక్స్ .భాషాశ్రీ గారితో నా అసోసియేషన్ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా ఇంకా ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది“ అన్నారు

Please follow and like us: