రంగు రివ్యూ

 

దర్శకత్వం : కార్తికేయ‌.వి
నిర్మాత : ఎ.ప‌ద్మ‌నాభ రెడ్డి, న‌ల్ల అయ‌న్న నాయుడు
సంగీతం : యోగీశ్వ‌ర శ‌ర్మ‌
సినిమాటోగ్రఫర్ : పిటి.సురేంద‌ర్ రెడ్డి
నటీనటులు : తనీశ్‌, ప‌రుచూరి ర‌వి, ప్రియా సింగ్‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ష‌ఫీ, త‌దిత‌రులు
విడుదల తేదీ : నవంబర్ 23, 2018
రేటింగ్ : 2. 25 / 5 

బాల నటుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న తనీష్ హీరోగా మాత్రం వరుస పరాజయాలను అందుకుంటున్నాడు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన సరే అతని ఫేట్ మాత్రం మారడం లేదు. ఈ మద్యే బిగ్ బాస్ రియాల్టిటి షో తో కాస్త క్రేజ్ అందుకున్న తనీష్ రంగు అంటూ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చాడు. నూతన దర్శకుడు కార్తికేయ‌.వి తెరకెక్కించిన చిత్రం ‘రంగు’. ఎ.ప‌ద్మ‌నాభ‌రెడ్డి, న‌ల్ల అయ్య‌న్న నాయుడు నిర్మించిన ఈ చిత్రం, ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఎలాంటి రంగులతో అలరించాడో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..

కథ :

టెన్త్ లో స్కూల్ టాపర్ అయిన లారా (త‌నీశ్‌) ఇంటర్లో కూడా అతనికి స్టేట్ సెకెండ్ ర్యాంక్ తెచ్చుకుంటాడు. బ్రిలియంట్ స్టూడెంట్ గా ఇంజనీరింగ్ కాలేజీలోకి అడుగు పెట్టిన లారా తన కాలేజ్ లో ఓ అమ్మాయి కోసం సీనియర్ తో గొడవ పడతాడు. సహజంగా ఆవేశపరుడైన లారా ఆ గొడవ కారణంగా దాడులు చేసంత దూరం వెళ్తాడు. ఆ క్రమంలో లారా అనుకోకుండా జరిగిన ఓ సంఘటన కారణంగా ఓ వ్యక్తిని చంపేస్తాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల లారా రౌడీ షీటర్ గా మారతాడు. సెటిల్ మెంట్స్ చేస్తాడు. ఈ క్రమంలో పూర్ణ (ప్రియా సింగ్‌) లారాను చూసి ఇష్ట పడుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఐతే అప్పటికే లారా పై శత్రువులు దాడి చెయ్యడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుంటారు. వారి నుండి ఏసీపీ రాజేంద్రన్ (పరుచూరి రవి) లారాను కాపాడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు ? ఆ ప్రయత్నాల వల్ల లారా వారి నుండి తప్పించుకున్నాడా ? లేడా ? అన్నది అసలు కథ.

ఆవేశపరుడైన యువకుడు లారా పాత్రలో త‌నీశ్‌ మంచి నటనను కనబరిచాడు. గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో పాత్రకు తగ్గట్లు కొత్త లుక్ తో కనిపించాడు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మరియు యాక్షన్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. హీరో హీరోయిన్ల మధ్య సీన్లు, వారి మధ్య కెమిస్ట్రీ బాగానే అలరిస్తుంది. కథానాయకిగా నటించిన ప్రియా సింగ్‌ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు తన నటనతోనూ మెప్పించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా హీరోని పోలిసుల నుండి కాపాడే సన్నివేశంలో ఆమె చాలా బాగా నటించింది. సినిమాలో మరో కీలక పాత్ర అయిన ఏసీపీ రాజేంద్రన్ పాత్రలో నటించిన పరుచూరి రవి ఆకట్టుకున్నాడు.
పోసాని , రఘు, తమ కామెడీ టైమింగ్ తో కొన్ని చోట్ల నవ్వించే ప్రయత్నం చేసారు. ఇక మిగతా నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బానే చేసారు.

ఇక టెక్నీకల్ పరంగా చుస్తే .. దర్శకుడు కార్తికేయ‌ మంచి పాయింట్ తీసుకున్నప్పటికీ, ఆ పాయింట్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా తెరకెక్కించే ప్రయత్నం చేయలేదు. పిటి.సురేంద‌ర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీత దర్శకుడు యోగీశ్వ‌ర శ‌ర్మ‌ అందించిన పాటలు జస్ట్ యావరేజ్ గా ఉన్నాయి. సెకండాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. బ‌స్వ రెడ్డి ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.
అయితే దర్శకుడు కార్తికేయ‌ విజయవాడలో జరిగిన కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా రౌడీ షీటర్ లారా జీవితానికి సంబంధించిన స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, దాన్ని ఆకట్టుకునేలా కథను మలచలేక పోయాడు. హీరో, విలన్లతో గొడవ పడే సన్నివేశాలకు కారణాలు కూడా పెద్దగా బలంగా అనిపించవు. అలాగే వారి మధ్యన వచ్చే గొడవ తాలూకు సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకున్నే విధంగా ఉండవు. కథనం ఆసక్తికరంగా నడిపితే బాగుండేది. దీనికి తోడు సినిమాలో ఎంటర్ టైన్మెంట్ కూడా పెద్దగా లేదు.
కథనం నెమ్మదిగా సాగడం, ప్రేమకు సంబందించిన సన్నివేశాలు ఆకట్టుకొన్నే విధంగా లేకపోవడం, స్టేట్ ర్యాంకర్ అయిన లారా ఓ రౌడీ షీటర్ గా మారడానికి, బలమైన కారణాలను చూపించపోవడం వంటి అంశాలు సినిమాపై ఆసక్తిని తగ్గిస్తాయి.

కోన్ని క్రైమ్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నా… సినిమా ఆసక్తికరంగా సాగలేదు. వాస్తవిక సంఘటనల ఆధారంగా కథను ఆసక్తిగా మలచకపోవడం పెద్ద మైనస్. సినమాలో చెప్పాలనకున్న మెయిన్ కంటెంట్ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకున్నా, తనిశ్ నటన, అలరించే అంశాలైతే .. నిరసించిన కథనం, ఎంటర్ టైనెంట్న్ లేకపోవడం వంటి విషయాలు సినిమాను నిరాశ పరుస్తాయి.

Please follow and like us: