నీతోనే హాయ్‌..హాయ్‌ ప్రారంభోత్స‌వం


కెఎస్‌పి ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై య‌ల‌మంచిలి ప్ర‌వీణ్ స‌మ‌ర్ప‌ణ‌లో డా.ఎ.స్. కీర్తి, డా.జి.పార్థ‌సార‌థి రెడ్డి సంయుక్తంగా బియ‌న్ రెడ్డి అభిన‌య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తోన్న చిత్రం `నీతోనే హాయ్ హాయ్‌`. అరుణ్ తేజ్ , ఛ‌రిష్మా శ్రీక‌ర్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్స‌వం బుధ‌వారం ఫిలింన‌గ‌ర్ టెంపుల్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో శ్రీకాంత్ ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా `మా` అధ్య‌క్షుడు శివాజీరాజా కెమెరా స్విచాన్ చేశారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రేలంగి న‌ర‌సింహారావు గౌర‌వ ద‌ర్శ‌కత్వం వ‌హించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన ప్రాత్రికేయుల స‌మావేశంలో ద‌ర్శ‌కుడు బి.య‌న్.రెడ్డి అభిన‌య మాట్లాడుతూ…“నా క‌థ‌ను న‌మ్మి ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ముందుకొచ్చిన మా నిర్మాత‌ల‌కు కృత‌జ్క్ష‌త‌లు. వారు నా పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటాను. మంచి టీమ్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. క‌థ విష‌యానికొస్తే…బాగా డ‌బ్బున్న వ్య‌క్తి వ్య‌క్తిత్వం ఎలా ఉంటుంది? మధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన వాడి మాన‌వ‌త్వం ఎలా ఉంటుంది? అనేది మా చిత్రం ద్వారా చూపిస్తున్నాం. క్యూట్ ల‌వ్ స్టోరీకి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. ఈ రోజు నుండి షెడ్యూల్ ప్రారంభ‌మైంది. మూడు షెడ్యూల్స్ లో సినిమాను పూర్తి చేయ‌డానికి ప్లాన్ చేశాం. విదేశాల్లో పాట‌లు చిత్రీక‌రించాలన్న ఆలోచ‌న‌లో ఉన్నాం“ అన్నారు.
చిత్ర నిర్మాత‌లు డా.ఎస్‌. కీర్తి, డా. జి. పార్థ‌సార‌థి రెడ్డి మాట్లాడుతూ…“బి.య‌న్.రెడ్డి గారి ప‌ట్టుద‌ల‌, త‌ప‌నతో పాటు క‌థ న‌చ్చి ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ముందుకొచ్చాం. బియ‌న్ రెడ్డిగారికి సినిమా రంగంలో ఎంతో అనుభ‌వం ఉంది. ఆ అనుభ‌వంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరిస్తార‌న్న న‌మ్మ‌కం ఉంది. ఏ విష‌యంలో రాజీ ప‌డ‌కుండా సినిమాను గ్రాండ్ గా నిర్మించ‌డానికి ద‌ర్శ‌కుడికి అన్ని విధాలుగా స‌హ‌క‌రిస్తున్నాం. ద‌ర్శ‌కుడిగా త‌న‌కు నిర్మాత‌లుగా మాకు మంచి పేరు తెచ్చి పెట్టే చిత్ర‌మ‌వుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ఐదు అద్భుత‌మైన పాట‌లు ర‌విక‌ళ్యాణ్ గారు కంపోజ్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కూ అన్ని చాలా బాగా వ‌చ్చాయి. ఇక మీద‌ట కూడా ఇలాగే ప్ర‌తిది సంతృప్తిక‌రంగా వ‌స్తుంద‌న్న న‌మ్మకం ఉంది. మా తొలి ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రించాలని కోరుకుంటున్నాం“ అన్నారు.
చిత్ర స‌మ‌ర్ప‌కులు య‌ల‌మంచిలి ప్ర‌వీణ్ మాట్లాడుతూ…“ సీనియ‌ర్ న‌టీన‌ట‌లుతో పాటు ప్ర‌తిభావంతులైన సాంకేతిక నిపుణుల‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ద‌ర్శ‌కుడు బియ‌న్ రెడ్డిగారికి నాట‌క రంగంలో మూడు నంది అవార్డులు వ‌చ్చాయి. అభిన‌య ఆర్ట్స్ పై ఆయ‌న ఎన్నో నాట‌కాలు చేశారు. అలాంటి ఒక ప్ర‌తిభావంత‌డితో… వైద్య‌రంగంలో ఎంతో పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చుకున్న ప్ర‌ముఖ న్యూరాల‌జిస్ట్ డా.ఎస్‌.కీర్తిగారు, గైనాకాల‌జిస్ట్ డా.జి. పార్థ‌సార‌థిరెడ్డిగారు ఈ చిత్రాన్ని తొలిసారిగా నిర్మిస్తున్నారు. వైద్య రంగంలో ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో ఈ సినిమా ద్వారా అభిరుచి గ‌ల నిర్మాత‌లుగా ఈ `నీతోనే హాయ్ హాయ్` చిత్రంతో పేరు తెచ్చుకుంటార‌ని ఆశిస్తున్నా“ అన్నారు.

Please follow and like us: