ఈ నెల 14న హుషారు

లక్కీ మీడియా సంస్థలో 9వ చిత్రంగా వస్తున్న మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘హుషారు’ అన్ని హంగులతో ఈ నెల డిసెంబర్ 14న విడుదల అవుతుంది .ఇటీవలే ఎంతో ఉత్సాహంగా బస్సు టూర్ లో భాగంగా తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రధాన నగరాల్లో కాలేజీలకు ‘హుషారు’ టీం విశేష ఆదరణ పొందింది .వెళ్లిన ప్రతీ కాలేజీలో వేల సంఖ్య లో విద్యార్థులు స్వాగతం పలికి ‘హుషారు’ సినిమాలో ఎంతో ట్రెండింగ్ లో ఉన్న ”వెళ్ళిపోమాకే” ”పిచాక్” పాటలను ఆడి,పాడి మూవీ టీంలో ఇంకా ఉత్సాహాన్ని పెంచారు. అన్ని కారిక్రమాలను పూర్తి చేసుకుని ఈ సినిమా ని ఈ నెల 14 న విడుదల కి అన్ని సన్నాహాలు పూర్తి చేసుకుంది.’హుషారు’ సాంగ్స్ తోనే ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసిన ఈ ‘హుషారు’ ఇంకా కుర్రకారు ని ఎన్ని కొత్త స్టెప్పులు వేయిస్తుందో మీరే చూస్తారు అని సక్సెస్ ఫుల్ నిర్మాత బెక్కం వేణుగోపాల్ అన్నారు.

Please follow and like us: