హావా ట్రైలర్ విడుదల

తెలుగులో ఇప్పటి వరకూ ఎన్నో కథలు చూశాం. చూస్తున్నాం. కానీ ప్రస్తుతం జానర్ బేస్డ్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటోంది. ఏ జానర్ లో వస్తోన్న సినిమా అయినా హానెస్ట్ గా రాసుకుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలా తెలుగులో వస్తోన్న మరో జానర్ బేస్డ్ ఫిల్మ్ ‘హవా’. రీసెంట్ గా రానా చేతుల మీదుగా విడుదల చేసిన మోషన్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ‘హవా’ కాన్సెప్ట్ పోస్టర్
ను సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల విడుదల చేశారు. సస్సెన్స్, క్రైమ్, కామెడీ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ మూవీకి ‘9 గంటలకు 9 నేరాలు 9 బ్రెయిన్స్’ అంటూ పెట్టిన క్యాప్షన్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరి ఆ తొమ్మిదిమంది ఎవరు.. ఏం నేరాలు చేశారు.. అదీ తొమ్మిదిగంటల్లోనే.. తద్వారా వాళ్ల లైఫ్ లో జరిగిన మార్పులేంటీ అనేది థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లేతో సాగే కథ. ఆస్ట్రేలియాలో ఇప్పటి
వరకూ ఎవరూ చిత్రీకరించని లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ ట్రైలర్ ను సినిమా ప్రముఖుల సమక్షంలో విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చేలా ఉందని ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమానికి హాజరైన అతిథులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ…. నందిని రెడ్డి – దర్శకురాలు న్యూ టాలెంట్ అంతా కొత్త ఐడియాస్, కథలతో వస్తోంది. వీళ్ల వల్ల మేం కాస్త జాగ్రత్తగా సినిమాలు చేయాల్సి వస్తోంది. మధుర శ్రీధర్ గారు ఎప్పుడూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తారు. నాకు క్రైమ్ కామెడీస్ అంటే చాలా ఇష్టం. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను..
రాజ్ కందుకూరి – నిర్మాత హవా టీమ్ కు ఆల్ ది బెస్ట్. మనసుపెట్టి కథ రాసుకుంటే చిన్న ఎటెంప్ట్ కూడా సక్సస్ అవుతుంది. మంచి సోల్ ఉంటే ఏ సినిమా అయినా ఆడుతుంది. కానీ ఇందులో తొమ్మిది సోల్స్ ఉన్నట్టు
తెలుస్తోంది. టీమ్ మంచి ఎఫర్ట్ పెట్టినట్టు తెలుస్తోంది. సినిమా కూడా చాలా రిచ్ గా కనిపిస్తోంది. ఇందులో మంచి కటెంట్ ఉన్నట్టు ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. మధుర శ్రీధర్ ఓ సినిమాను మెచ్చుకున్నారంటే ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఆర్టిస్టులంతా బావున్నారు. దర్శకుడు మహేష్ వంటి వారి కోసం టాలీవుడ్ ఎదురుచూస్తోంది. ఎంటైర్ టీమ్ కు ఆల్ ది బెస్ట్

Please follow and like us: