ram-charan-ktrఐస్ బకెట్ ఛాలంజ్ గురించి విన్నారుగా .. ఆ తరువాత రైస్ బకెట్ ఛాలెంజ్ అంటూ మరో సవాల్ కూడా పాపులర్ అయింది .. ఇప్పుడు అదే తరహాలో .. తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ కూడా ఇలాంటి ఛాలెంజ్ ఒకటి విసిరాడు .. అదికూడా సెలబ్రిటీలకు కావడం విశేషం? ఇంతకి ఆ ఛాలెంజ్ ఏమిటో తెలుసా .. చేనేత వస్త్రాలు ధరించాలని వాళ్లకు ఛాలెంజ్ విసిరాడు? లేటెస్ట్ గా చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించాలనే పనిలో భాగంగా ఈ సవాల్ విసిరాడు. ఆ సవాల్ ఏమిటో తెలుసా .. ఈ ఛాలెంజ్ ప్రకారం నేను హ్యాండ్లూమ్ ధరించి ఫోటో దిగి పంపిస్తా. చేనేత పనివారికోసం నేను హ్యాండ్లూమ్ దరిస్తున్నా మరి మీ సంగతి ఏమిటి ? అంటూ కొంతమందిని అయన నామినేట్ చేశారు .. వారిలో మహేష్ బాబు, వివేక్ ఒబెరాయ్, మంచు లక్ష్మి , నాగార్జున , సమంత, సానియా మీర్జా లకు ఈ హ్యాండ్లూమ్స్ ఛాలెంజ్ విసిరాడు. ఈ సవాల్ ను స్వీకరించిన సానియా వెంటనే .. ఆస్ట్రేలియన్ ఓపెన్ పూర్తీ అయ్యి హైద్రాబాద్ రాగానే ధరిస్తాను అంటూ రిప్లై ఇచ్చింది. అంతే కాదు ఆమెకూడా మహేష్ భూపతి, రోహన్ బోపన్న, పివి సింధు, రానా లకు ఛాలెంజ్ విసిరింది. ఇక కేటీఆర్ విసిరిన ఛాలెంజ్ కు జాతీయ నటుడు కమల్ హాసన్ వెంటనే స్పందించాడు .. నేను చేనేత వస్త్రాలు ధరిస్తాను, మా నాన్నను అయన జీవితం మొత్తం మీద హ్యాండ్లూమ్స్ తోనే కనిపించాడు అని ట్విట్టర్ లో స్పందించాడు.