chiranjeevi-khaidi-no-150నిన్న జరిగిన ”ఖైదీ నం 150” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగబాబు ముఖ్యంగా ఇద్దరినీ టార్గెట్ చేసాడు. రీమేక్ చేస్తే తప్పేంటో నాకు అర్థం కావడం లేదు, చరణ్ ఒక్కడే కాదు అన్నయ్య, పవన్ కూడా రీమేక్ లు చేసారు, అందులో తప్పేమి లేదు అని అంటూనే ప్రతి వాడి చూపు మెగా ఫ్యామిలీ పై ఉందని, ఆయన్ను, అయన ఫ్యామిలీ ని విమర్శిస్తే కొంత మైలేజి వస్తుందని ఈ మద్యే ఓ ప్రముఖుడు రచన వ్యాసంగంలో ఆరితేరిన వ్యక్తి .. వ్యక్తిత్వ వికాసం గురించి చర్చించే అయన .. ఇలా చరణ్ గురించి చెత్త కామెంట్స్ చేసాడు, ముందు వ్యక్తిత్వ వికాసం ఆయనకు నేర్పాలి అన్నాడు…. ఆ రచయిత ఎవరో మీకు ఈ పాటికి అర్థం అయి ఉంటుంది, అక్కడితో ఆగకుండా అలాగే మరో వ్యక్త్తి ముంబై వెళ్లి అక్కడ ఎదో పొడుస్తానని చెప్పి .. అక్కడ ఏమి చేయలేక .. ఇక్కడ ఇష్టమొచ్చిన కూతలు కూస్తున్నాడు. ట్విట్టర్ లో అదే పనిగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ పిచ్చి కూతలు కూస్తూ చిరంజీవి ఇలాంటి సినిమా చేయాలి, ఆ సినిమా ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నాడు. అతనిలా అడ్డంగా డైరెక్టర్ కాలేదు .. ఎంతో కష్టపడితే ఈ స్థాయికి వచ్చాము ముందు మంచి సినిమాలు తీయడం నేర్చుకో అంటూ ఘాటు కామెంట్స్ చేసాడు !! ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా .. హిట్ సినిమాను ఎవరు ఆపలేరు అంటూ మాట్లాడారు .. ఇంతకి అయన చెప్పిన దర్శకుడు ఎవరో మీకు ఈ పాటికే అర్థం అయి ఉంటుంది.. !!