tamanna-hot-stillsతమన్నాకు పెళ్లి చూపులు ఏమిటి ? అని అంటారా !! అవును అప్పుడే తమన్నా పెళ్ళికి రెడీ అయిందా ? అని అనుకుంటున్నారా ? అసలు విషయం ముందు వినండి .. !! మీరే అన్ని ఊహించేసుకుంటే ఎలా ? ఇంతకీ అసలు విషయం ఏమిటంటే .. తెలుగులో చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ”పెళ్లి చూపులు” సినిమా తమిళంలో రీమేక్ కానుంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ హక్కులు భారీ పోటీ మధ్య సొంతం చేసుకున్నాడు. ఇక తమిళంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా నటించిన ఈ సినిమాలో రీతూ వర్మ పాత్రలో తమన్నా నటిస్తుందట. ఇక హీరో ఎవరనె విషయం త్వరలో ప్రకటిస్తారట !! సెంథిల్ వీరాస్వామి దర్శకత్వంలో కొత్త హీరో నటిస్తాడట !! అది విషయం.