dasari-narayanaraoతమిళనాడు సీఎం జయలలిత జీవిత కథను తెరకెక్కించేందుకు జోరుగానే సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలు ఈ విషయం పై అప్పుడే వర్కవుట్స్ మొదలు పెట్టారు? ఇక ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు ప్రముఖ సీనియర్ దర్శకుడు దాసరి నారాయణ రావు? ఈ మధ్య దాసరి సినిమాలకు దర్శకత్వం వహించడం లేదు. ఆ మధ్య చేసిన రెండు సినిమాలు పరాజయం పాలవడంతో అయన దర్శకత్వం చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇక చిన్న సినిమాలకు అండగా ఉండాలనే ప్లాన్ లో భాగంగా ఈ ఏడాది నుండి అయన దర్శకుడి పగ్గాలు అందుకోనున్నారట. ఈ నేపథ్యంలో జయలలిత జీవిత కథతో సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా సిద్ధం అవుతుందట!! తానే దర్శకత్వం వహిస్తూ .. నిర్మించే ఈ సినిమా త్వరలోనే పట్టాలు ఎక్కనుంది. ఈ చిత్రానికి ”అమ్మ” అనే టైటిల్ పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించారట !! త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెల్లడిస్తాడట. ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా నిర్మిస్తానని అప్పట్లో ప్రకటించాడు దాసరి .. ఇంకా ఆ ప్రాజెక్ట్ ఫైనల్ కాలేదు.