tollywod-starఈ మధ్య టాలీవుడ్ యంగ్ బ్యాచ్ మంచి స్నేహబంధం ఉందన్న విషయం ఈ మధ్య ఏ ఆడియో ఫంక్షన్ చుసిన తెలుస్తుంది. ఒక హీరో ఆడియో వేడుకకు ఇద్దరు ముగ్గురు యువ హీరోలు రావడం అన్నది చూస్తున్నదే. ఇక ఈ బ్యాచ్ కి టైం దొరికిందంటే పార్టీలు .. పబ్బులంటూ నానా హంగామా చేస్తుంటారు .. ఇప్పుడు న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కూడా వారు జోరుగా ఎంజాయ్ చేశారు? అదికూడా గోవాలో !! అవును ఈ ఇయర్ సందర్బంగా సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్, రేజినా, సమంత , నాగ చైతన్య, రానా , శ్రియ, డిజైనర్ నీరజ కోన, శిల్ప రెడ్డి, అఖిల్, ఇలా ఈ బ్యాచ్ మొత్తం గోవాలో నానా హంగామా చేశారట? ఇందులో ఏ హీరో, ఏ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడో అన్నది పక్కన పెడితే .. ఈ బ్యాచ్ మొత్తం ఇలా గోవాలో ఎంజాయ్ చేయడం మాత్రం సంచలనం గా మారింది?