అ ! రివ్యూ

దర్శకత్వం : ప్రశాంత్ వర్మ
నిర్మాత : ప్రశాంతి త్రిపురనేని
సంగీతం : మార్క్.కె. రాబిన్
సినిమాటోగ్రఫర్ : కార్తీక్ ఘట్టమనేని
ఎడిటర్ : గౌతమ్ నెరుసు
నటీనటులు : కాజల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బ, రెజినా కసాండ్రా, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, మురళీ శర్మ, దేవ దర్శిని తదితరులు …
విడుదల తేదీ : ఫిబ్రవరి 16, 2018
రేటింగ్ : 2. 75 / 5

తెలుగులో కొత్త తరహా సినిమాలు రావా అనే ప్రేక్షకులకు ఓ కొత్త ప్రయత్నాన్ని అందించే ప్రయత్నం చేసాడు హీరో నాని. హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకుంటూ వరుస విజయాలు అందుకుంటున్న నాని ఈ సినిమాతో నిర్మాతగా మారినా చేసిన మొదటి ప్రయత్నం అ !. వాల్ పోస్టర్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా ప్రశాంత్ వర్మ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేసారు. క్రేజీ హీరోయిన్స్ కాజల్, రెజీనా, ఈషా రెబ్బ, నిత్యా మీనన్ లాంటి హీరోయిన్స్ నటించడంతో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయాయి. సినిమాలు రెగ్యులర్ గా చూసే సినిమా లవర్స్ కు ఈ సినిమా చేస్తే ఇతర సినిమాలు గుర్తొచ్చే అవకాశం లేకపోలేదు. ఎస్.జె.సూర్య “ఇసై”, క్రిస్టఫర్ నోలన్ “ఇన్సెప్షన్”, డిస్నీ వారి “ఇన్సైడ్ ఔట్” వంటి చిత్రాలు గుర్తుకువస్తాయి. అయితే తెలుగులో మాత్రం తప్పకుండ అ ఒక ప్రయోగమే అని చెప్పక తప్పదు. మరి అ ! అంటే ఏమిటి .. ఇంతమంది హీరోయిన్స్ ఎందుకున్నారు .. వాళ్ళ కథా కమామీషు ఏమిటో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..

కథ:

ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్, మనిషిలోని చాలా భిన్న కోణాలుంటాయి, వాటిని సమాజానికి భయపడో లేక కుటుంబ పరిధులను దృష్టిలో ఉంచుకోనో మనిషి తనలోని ఎమోషన్స్ ని లోపలే దాచుకుని . .. పైకి మాత్రం ఒకే ఫీలింగ్ తో కనిపిస్తాడు. అయితే అతనిలోని భిన్నమైన పార్శ్యాలు స్పందిస్తే ఎలా ఉంటుంది అన్న పాయింట్ అఫ్ వ్యూ లో తెరకెక్కించిన సినిమా అ ! నలభీమ .. ఓ రెస్టారెంట్ లో చెఫ్ .. తనకు ఏ రెసిపీ ( వంటలు ) చేయడం రాదు .. తాను మంచి వంటలు చేసాడని రుజువు చేసుకుంటే తప్పకుండా జాబ్ వస్తుంది .. అప్పుడు అతగాడికి వంటలు రావన్న విషయం తెలుసుకున్న చేప .. అతనితో వంటలు చేయిస్తూ ఉంటుంది .. అదే రెస్టారెంట్ లో మీర (రెజినా) .. ఓ సర్వీస్ గర్ల్ .. ఆ హోటల్ లో గేట్ కీపర్ శివ (శ్రీనివాస్ అవసరాల) ఇలా రకరకాల పాత్రలు కథలోకి వస్తుంటాయి .. అయితే వీటిన్నింటికి లింక్ ఎక్కడ ఉంది . ఎవరి వ్యక్తిగత సమస్యలతో వాళ్ళు సతమతమవుతుంటారు ..వాళ్ళ మధ్యలో కాలి (కాజల్ అగర్వాల్) అనే అమ్మాయి అందరికన్నా తీవ్రమైన మానసిక సమస్యతో బాధపడుతూ, విముక్తి కోసం మాస్ మర్డర్స్ చేయాలనుకుంటుంది. అసలు రాధ, క్రిష్, నలభీమ.. వీళ్లంతా ఎవరు, ఒకరికొకరికి మధ్యన సంబంధం ఏంటి, కాలి ఎవర్ని చంపాలనుకుంది, చివరికి వీళ్లందరి కథ ఎలా ముగిసింది మరి వాళ్ల సమస్యకు పరిష్కారం దొరికిందా అన్నది ఆసలు కథ ..

ఆరంభం నుండి చూపించిన అనేక పాత్రలకి, వాటి చర్యలకి, సన్నివేశాలకి, మాటలకి జస్టిఫై చేసేలా ఉన్న ఈ ముగింపు చాలా థ్రిల్లింగా ఉంటుంది. సినిమాకి ప్రధాన బలం క్లైమాక్స్. ఏమాత్రం ఊహకందని ఈ ముగింపు చూశాక సినిమా అర్థమైన ప్రేక్షకుడు ఎవరైనా దర్శకుడ్ని మెచ్చుకోకుండా ఉండడు. మొదటి అర్థ భాగం మొత్తాన్ని పాత్రల పరిచయానికే వాడుకున్న దర్శకుడు ముఖ్యమైన నిత్యా మీనన్, ఈషా రెబ్బ, కాజల్ అగర్వాల్, రెజినా వంటి పాత్రల్ని చాలా ఆసక్తికరంగా పరిచయం చేశాడు. ముఖ్యంగా కాజల్, రెజినా పాత్రలు తీవ్రంగా, మురళీ శర్మ, ప్రియదర్శి పాత్రల్లో మంచి ఫన్ మూమెంట్స్ దొరుకుతాయి. చేప (నాని), బోన్సాయ్ చెట్టు (రవితేజ)ల మధ్యన జరిగే సంభాషణలు నవ్వించాయి. నాని, రవితేజ ల వాయిస్ ఓవర్ ఆకట్టుకుంటుంది. నిత్యామీనన్, ఈషా రెబ్బ రోల్స్ చిన్నవే అయినా.. వారి క్యారెక్టరైజేషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ప్రియదర్శి పాత్ర హాలీవుడ్ చిత్రం “రటాటౌలి”లోని ప్రధాన పాత్రను తలపిస్తుంది. రెజీనా రోల్ చేయడానికి ధైర్యం కావాలి.. ఆమె తప్ప మరెవరూ కూడా ఆ పాత్రను అంత కాన్ఫిడెంట్ గా చేయలేకపోయేవారేమో. మురళీశర్మ రోల్ సినిమాలో చాలా కీలకం కానీ అది అర్ధమవ్వడం కాస్త కష్టం. ఇక ఇంటర్వెల్ సన్నివేశాన్ని ఆసక్తికరంగా ముగించి .. రెండో భాగంలో ప్రేమ, కొన్ని సోషల్ ఎలిమెంట్స్, హర్రర్ వంటి జానర్లను సమపాళ్లలో మిక్స్ చేసిన దర్శకుడు ఎండింగ్ మాత్రం ఊహించని రీతిలో ముగించాడు.

మార్క్.కె. రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరొక పెద్ద బలం. కీలకమైన ప్రతి సన్నివేశాన్ని ఎఫెక్టివ్ గా తయారుచేశారు . దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆలోచన, దాన్ని అమలుపరిచిన విధానం బాగుంది. పేపర్ మీదే తికమకగా అనిపించే ఈ కథను కొన్ని చిన్న చిన్న లోపాలున్నా తెర మీద సాద్యమైనంత వరకు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా తీయడానికి ప్రయత్నించిన అతని ప్రయత్నం మెచ్చుకోవచ్చు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలుస్తుంది. సినిమా మొత్తని సింగిల్ లొకేషన్లో తీసినా ఎక్కడా సన్నివేశాలు బోర్ కొట్టకుండా చిత్రీకరించాడు. గౌతమ్ నెరుసు ఎడిటింగ్ బాగానే ఉన్నా ద్వితీయార్ధంలో ఇంకాస్త అర్థం అయ్యే రీతిలో చెప్పి ఉంటె బాగుండేది. కొత్త తరహా సినిమాలు మనం ఎందుకు చేయకూడదు అన్న నాని ప్రయత్నం బాగుంది. నిర్మాతగా నాని కొత్త తరహా ప్రయత్నానికి కావలసిన ఏర్పాట్లు బాగా చేసాడు ..నిర్మాణ విలువలు బాగున్నాయి. ద్వితీయార్థంలో ముంగింపుకు ముందు జరిగే కొన్ని సన్నివేశాలు కొంత కన్ఫ్యూజన్ కు గురిచేస్తాయి. కొత్తదనాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఫలితంతో సంబంధం లేకుండా ఒకడుగు ముందుకేసి నాని చేసిన ఈ సినిమా కొత్తదనాన్ని కోరుకునే వారికి నచ్చినా ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా కేవలం కాన్సెప్ట్ ఆధారంగా తీయడంతో అందరికి నచ్చాలని లేదు.

తెలుగు సినిమాల్లో ఇది ఖచ్చితంగా ఒక ప్రయోగమని చెప్పాలి. దర్శకుడు తన ఊహని ప్రేక్షకులకు అర్ధమయ్యే రీతిలో ఇంకాస్త నింపాదిగా, అర్ధవంతంగా వివరించి ఉంటే సినిమాని కేవలం ఒక జోనర్ ప్రేక్షకులకె కాకుండా అందరికి అర్థం అయి ఉండేది. మొదటి నుండి నిర్మాత నాని, దర్శకుడు ప్రశాంత్ వర్మలు చెబుతున్నట్టే రెగ్యులర్ సినిమాల కోణం నుండి చూడాల్సిన సినిమా కాదు. దర్శకుడు సింపుల్ లైన్ కు తెలివైన కథనాన్ని, బలమైన పాత్రల్ని, సన్నివేశాల్ని, థ్రిల్ చేసే ఇంటర్వెల్, ఆశ్చర్యపరిచే ముగింపును జోడించడంతో సినిమా కొత్తగా, ఆశ్చర్యపోయే విధంగా తయారైంది. కానీ ద్వితీయార్థంలోనే కొన్ని సీన్స్ తికమకపెట్టాయి. ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండిఉంటే ఇంకా బాగుండేది .

Please follow and like us: