మాలీవుడ్ లోకి సన్నీ లియోన్

సన్నీలియోన్ పేరు తెరపై కనిపిస్తే చాలు థియేటర్లు ఫుల్ అయియ్యే పరిస్థితి. ఆమెకు బాలీవుడ్ లో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ భాషల్లోనూ ఓ రేంజ్ క్రేజ్ ఏర్పడింది. అందుకే ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజాగా సన్నీలియోన్ కు మాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. సంతోష్ నాయర్ అనే మలయాళ దర్శకుడు సన్నీలియోన్ కోసం “రాంగీలా” అనే స్క్రిప్ట్ రెడీ చేసుకొన్నాడట. ఒక హీరోయిన్ లైఫ్ ను ఆన్ స్క్రీన్ ప్రెజంట్ చేయనున్న ఈ చిత్రంలో సన్నీలియోన్ ఒక స్ట్రగ్లింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. వచ్చే ఏడాది నుంచి రెగ్యులర్ షూట్ మొదలవ్వనున్న ఈ చిత్రం కోసం సన్నీలియోన్ ఆల్రెడీ మలయాళం నేర్చుకోవడం మొదలెట్టిందట. ఆల్రెడీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసి అక్కడి యువత హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకొన్న సన్నీలియోన్ ఇప్పుడు ఈ మలయాళం ఎంట్రీతో తన స్టార్ డమ్ ను మరింత బలోపేతం చేసుకొంటోంది.

Please follow and like us: