megastarమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150 వ సినిమా ఈ నెల 11 న విడుదలకు సిద్ధం అయింది. ”ఖైదీ నంబర్ 150” పేరుతొ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తరువాత మెగాస్టార్ 151 వ సినిమా కోసం అప్పుడే సన్నాహాలు మొదలు పెట్టాడు. మెగాస్టార్ నెక్స్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు? ప్రస్తుతం బోయపాటి శ్రీను, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు, ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తీ చేసుకుంది చిత్రం. ఇక ఈ ప్రాజెక్ట్ తరువాత మెగాస్టార్ తో సినిమా చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు బోయపాటి. ఇటీవలే అల్లు అర్జున్ తో ”సరైనోడు” వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బోయపాటి తో సినిమా చేయడానికి చిరంజీవి కూడా ఆసక్తి చూపించడంతో ఈ ప్రాజెక్ట్ స్పీడ్ గా పట్టాలు ఎక్కేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అన్నట్టు ఈ చిత్రాన్ని రామ్ చరణ్, సుకుమార్ లతో సినిమా చేస్తున్న బ్యానర్ నిర్మిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.