ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఫిక్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించే సినిమాకు రంగం సిద్ధం అయింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తీ కావొచ్చినా ఈ సినిమా మార్చ్ మొదటి వారంనుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కూడా న్యూ లుక్ లో కనిపించేందుకు జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు. రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కే ఈ సినిమాలో హీరోయిన్ ని ఫిక్స్ చేశారట. ఆమె ఎవరో కాదు .. పూజ హెగ్డే !! డీజే సినిమాతో ఫామ్లోకి వచ్చిన హాట్ భామ పూజ గ్లామర్ షో లకు కుర్రకారుకు పిచ్చెక్కించింది. అందుకే ఆమెకు టాలీవుడ్ ఫిదా అయింది. వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ భామ ఎన్టీఆర్ సరసన లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఇంతకు ముందు అను ఇమ్మానియేల్ ని తీసుకుందామని అనుకున్నారు .. కానీ అజ్ఞాతవాసి ఎఫెక్ట్ తో అను ఇమ్మానుయేల్ ప్లేస్ లోకి పూజ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం పూజ హెగ్డే బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సాక్ష్యం సినిమాలో నటిస్తుంది.

Please follow and like us: