ఆ దర్శకుడు వేధించాడంటున్న అమల పాల్

తమిళ దర్శకుడు సుశి గణేశన్ తనను వేధించాడని సంచలన వ్యాఖ్యలు చేసింది సౌత్ హీరోయిన్ అమల పాల్ ? ఇటీవలే సుశి గణేశన్ తనను వేధించాడని దర్శకురాలు లీనా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను సమర్థిస్తూ అమల పాల్ కూడా కామెంట్స్ చేసింది. ఈ పోస్ట్ పెట్టిన తరువాత సుశి గణేశన్ అతని భార్య తనను ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారని పేర్కొంది. అంతే కాదు నా వ్యక్తిత్వాన్ని తప్పు పట్టరాని ఫైర్ అయింది అమల పాల్. సుశి గణేష్ దర్శకత్వంలో తాను తిరుతుపయిలే సినిమాలో నటించానని, అప్పుడు చాలా ఇబ్బందుకు ఎదుర్కొన్నానని పేర్కొంది. అతని అరాచకాలను బయటపెట్టిన లీనను అభినందిస్తున్నానని తెలిపింది. తనని వాళ్ళు బెదిరించాలని చూస్తున్నారని పేర్కొంది. మొత్తానికి అమల పాల్ కామెంట్స్ కోలీవుడ్ లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.

Please follow and like us: