ఆపరేషన్ 2019 ప్రీ రిలీజ్ వేడుక 

అలివేల‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్పించు టి. అలివేలు నిర్మించిన క‌ర‌ణం బాబ్జీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ఆప‌రేష‌న్ 2019. శ్రీ‌కాంత్‌, మంచుమ‌నోజ్, సునీల్‌ న‌టిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 1వ తేదీన‌ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం దస్పల్లా హోటల్ లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జ‌రుపుకుంది. ఈ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ అంతా క‌లిసి ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఆడియో సీడీని, టీజ‌ర్‌ను మా అధ్య‌క్షులు ముర‌ళీమోహ‌న్‌, హీరో గోపీచంద్ క‌లిసి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశంలో… హీరో గోపీచంద్ మాట్లాడుతూ…25 సిఇనిమాలు చేసిన వాళ్ళ‌కే త‌ల ప్రాణం తోక‌కొచ్చింది. అలాంటిది 125 చిత్రాలు చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు శ్రీ‌కాంత్ అన్న‌య్య చాలా గ్రేట్ . కంగ్రాట్స్ అన్న‌య్య‌. ఆప‌రేష‌న్ దుర్యోధ‌న ఎంత హిట్ అయిందో ఈచిత్రం కూడా అలాగే మంచి హిట్ సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. ఈ చిత్ర డైరెక్ట‌ర్ చాలా బాగా తీశారు. సినిమాటోగ్రాఫ‌ర్ కూడా అంద‌ర్నీ బాగా చూపించారు. మంచి హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.
ముర‌ళిమోహ‌న్ మాట్లాడుతూ… ప్ర‌ముఖ హీరో శ్రీ‌కాంత్ ఈ చిత్రం ట్రైల‌ర్‌ను, పాట‌లు చూశాను. చాలా చాలా బావున్నాయి. పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చే ఈ చిత్రం అంద‌రిలో ఎవేర్నెస్ తీసుకురావాలి. ఇంత‌కుముందు కూడా పొలిటిక‌ల్ చిత్రాలు ఎన్నో వ‌చ్చాయి. కాని అవి ఎవ‌రో ఒక‌ర్నివిమ‌ర్శ‌స్తూ వ‌చ్చిన చిత్రాలే ఈ చిత్రం అలా కాదు దేశాన్ని ఎవ‌రు ప‌రిపాలించ‌బోతున్నారు మ‌నం ఎవ‌రికి ఓటు వెయ్యాలి అని ప్ర‌జ‌ల్లో ఒక ఎవేర్నెస్ తీసుకువ‌చ్చే చిత్ర‌మిది. ఈ చిత్రం మంచి హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ శ్రీ‌కాంత్ అని అన్నారు.
ద‌ర్శ‌కుడు క‌ర‌ణం బాబ్జి మాట్లాడుతూ… ఈ చిత్రంలోని సాంగ్స్ చాలా బావున్నాయి. నా టెక్నీషియ‌న్స్ అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు. ప్రొడ్యూస‌ర్‌గారు ఈ చిత్రం కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. మ‌నోజ్‌, సునీల్ కూడా ఈ చిత్రంలో చాలా బాగా న‌టించారు. శ్రీ‌కాంత్ గారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అన్ని ప‌నులు తానే ద‌గ్గ‌రుండి చూసుకునేవారు. డిసెంబ‌ర్ 1వ తేదీన ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది అంద‌రూ థియేట‌ర్ల‌కి వెళ్లి చూడాల‌ని కోరుకుంటున్నాను ఎన్నో పెద్ద సినిమాల మ‌ధ్య మా చిన్న చిత్రం విడుద‌ల చేస్తున్నాం. మిమ్మ‌ల్ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంద‌ని మీ అంద‌రిఇకీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌ని కాన్ఫిడెంట్‌గా చెపుతున్నాను అన్నారు.
హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ… ఈ సినిమా పాట‌లు, రీరికార్డింగ్ చాలా బాగా కుదిరాయి. ఈ చిత్రం త‌ర్వాత మ్యూజిక్ డైరెక్ట‌ర్‌కి మంచి భ‌విష్య‌త్ ఉంట‌ది. ద‌ర్శ‌కుడు క‌ర‌ణం బాడ్జి ఎవ‌రికీ అర్ధం కాడు అర్ధం చేసుకోవాలి. చాలా డెడికేటెడ్ ప‌ర్స‌న్ సినిమా త‌ప్ప వేరే ప్ర‌పంచం ఉండ‌దు. మా కాన్ఫిడెన్స్

Please follow and like us: